డిచ్పల్లి, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులు ఎవరినైనా మానసికంగా శారీరకంగా భయభ్రాంతులకు గురిచేస్తే 1997 యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్. రాజా వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం శిక్షకు గురైనచో భవిష్యత్తులో పాస్ బిపోర్ట్, వీసాలకు అనుమతులు రావని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ హారతి అధ్యక్షత వహించగా ఆడిట్ సెల్ డైరెక్టర్, ఆచార్య గంటా చంద్రశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, ఆచార్య రవీందర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిచ్పల్లి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.