కామరెడ్డి, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రతీ ఒక్కరు అటవీ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడంతో.పాటు, మొక్కలను నాటి సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలులో భాగంగా ప్రపంచ వన్యప్రాణీ దినోత్సవం సందర్భంగా మాచారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్, చుక్కాపూర్ యందు ‘‘వనదర్షిణి’’ కార్యక్రమాన్ని మాచారెడ్డి హైస్కూల్ విద్యార్థులతో మాచారెడ్డి రేంజ్ పరిధిలో లో ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తూ, అటవీ ప్రాముఖ్యత గురించి విద్యార్థి దశ నుండి తెలుసుకోవడంతో పాటు ప్రతీ విద్యార్థి ఒక్కో మొక్కను నాటి సంరక్షించుకోవాలని తెలిపారు. ప్రత్యక్షంగా నేర్చుకొన్న విషయాలను తోటి విద్యార్థులకు వివరించాలని తెలిపారు. పర్యావరణ సమతుల్యం కావడానికి అడవుల పెంపకం అవసరమని తెలిపారు. అడవుల ప్రాముఖ్యత, గ్రహాలు, జీవరాసుల పై విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉత్సాహంగా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత, సంపద వంటి అంశాలపై వివరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా అటవీ అధికారిణి భోగ నిఖిత మాట్లాడుతూ ఆహారపు గొలుసు సరిగా ఉండాలంటే వృక్షాలు, వన్యప్రాణి ఎంతో అవసరమని అన్నారు. అడవిలో మంటలు చెలరేగకుండ అటవీ సంపదను కాపాడేందుకు సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకోవడం, అప్రమత్తంగా ఉండడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్ తరాల వారికి అటవీ సంపదను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఉపశమన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు పర్యవరణపై అవగాహన కలిగి ఉండాలని, భావి తరాల వారికి సమతుల్య వాతావరణం అందించేందుకు పూర్వీకులు మొక్కలు నాటి సంరక్షించేవారని తెలిపారు.
రేంజ్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్బంగా వనదర్షిణి కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహిస్తున్నామని, మొక్కల పెంపకం, వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ సంవత్సరం ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రం కలెక్టర్ అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ గోపి బాబు, మచారెడ్డి, కామారెడ్డి అటవీ సిబ్బంది, స్కూల్ టీచర్లు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.