కామారెడ్డి, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజునే తాను జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, నాయకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేస్తానన్నారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన్సూర్ ఎన్నికయ్యారు.