Breaking News

కామారెడ్డి రైల్వేస్టేషన్‌ పునరాభివృధ్ధికి భారీగా నిధులు

కామారెడ్డి, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుంది. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’’ (ఏ.బి.ఎస్‌.ఎస్‌.) కింద 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఎంపిక చేసి పునరాభివృద్ధి చేస్తున్నారు.

భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిచేయడం లక్ష్యంగా పెట్టుకుని ఏ.బి.ఎస్‌.ఎస్‌.విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరియు రైల్వే స్టేషన్‌లలో పాట్రోనేజ్‌ పెంపొందించే మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడిరది.

ఇది పూర్వం నిజాం గ్యారెంటీడ్‌ స్టేట్‌ రైల్వే (ఎన్‌.జి.ఎస్‌.ఆర్‌.) మరియు గోదావరి వ్యాలీ రైల్వేలచే నిర్మించబడిన హైదరాబాద్‌- మన్మాడ్‌ రైల్వే లైన్‌ అని పిలువబడిరది. సికింద్రాబాద్‌-మన్మాడ్‌ తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న ఒక ముఖ్యమైన రైలు మార్గం. సికింద్రాబాద్‌-మన్మాడ్‌ రైలు మార్గం కామారెడ్డిని కలుపుతూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను మరియు ప్రయాణీకులకు రవాణా సేవలను అందించే ప్రధానమైన వనరు.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ప్రణాళిక చేయబడిన సౌకర్యాలు :
కామారెడ్డి రైల్వే స్టేషన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో నాన్‌-సబర్బన్‌ గ్రేడ్‌-4 (ఎన్‌.ఎస్‌.జి.-4)గా వర్గీకరించబడిరది.

ఈ స్టేషన్‌లో సికింద్రాబాద్‌, నాగర్‌సోల్‌, ముంబై, నాందేడ్‌, తిరుపతి, బెంగళూరు మొదలైన అనేక దిశలలో ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు కూడా ఆగుతాయి.

ఈ స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పధకం (ఏ.బి.ఎస్‌.ఎస్‌.) కింద సుమారుగా రూ. 39.84 కోట్లతో పునరాభివృద్ధి చేయడానికి గుర్తించబడిరది .

ప్రతిపాదిత పనులు

సుమారు 360 చ.మీ. విస్తీర్ణంతో స్టేషన్‌ భవన పునరాభివృద్ది.

స్టేషన్‌ ప్రాంగణం అభివృద్ధి (సుమారు 2450 చ.మీ.లు)

స్టేషన్‌ మొదటి ప్రవేశ ద్వారం సౌకర్యాల అభివృద్ధి.

రెండవ ప్రవేశం ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న షెడ్‌ను బుకింగ్‌ కార్యాలయంగా మార్చడం.

మొదటి ప్రవేశంలో జి.ఆర్‌.పి. కార్యాలయాన్ని కూల్చివేయడం పూర్తయింది మరియు ట్రాక్‌ మెషిన్‌ విశ్రాంతి గదిని జి.ఆర్‌.పి. కార్యాలయంగా మార్చడం పురోగతిలో ఉంది.

ప్రయాణీకుల సౌకర్యార్థం 3 లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటుతో పాటు 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన నిర్మాణం.

ప్లాట్‌ఫారమ్‌ ఉపరితల మెరుగుదల.

ప్లాట్‌ఫారమ్‌ పై అదనపు కప్పు ఏర్పాటు.

దివ్యాంగుల సౌకర్యాలతో సహా టాయిలెట్ల మెరుగుదలలు మరియు నిర్మాణం.

ప్రయాణీకులకు అనుకూలంగా కోచ్‌లను తెలిపే మరియు రైళ్ల రాకపోకలను తెలియజేసే సూచిక బోర్డులు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని పనులు ఏకకాలంలో శర వేగంగా జరుగుతున్నాయి.

Check Also

గ్రూప్‌ 2 సిబ్బంది సకమ్రంగా విధులు నిర్వహించాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »