డిచ్‌పల్లి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్) ఎల్‌ఎల్‌బి రివాల్యుయేషన్ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్- ఏపీ ఈ, పి సి హెచ్, ఐ ఎం బి ఏ, ) మరియు ఎల్.ఎల్.బి, ఒకటవ, రెండవ, మూడవ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు నవంబర్ / డిసెంబర్ 2024 లో ప్రకటించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.
ఒక్క పేపర్ కు 500 రూపాయలు రివాల్యుయేషన్ ఫామ్ కు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ 12-12-2024 సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని పరీక్షల నియంత్రధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటననలో తెలిపారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందన్నారు.