నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పర్యటనకు హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని గురువారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సీఈఓ అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయి స్థానిక అంశాలపై చర్చించారు.