తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎలాంటి తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ తో కలిసి ఈఆర్‌ఒ లు, ఏఈఆర్‌ఒ లు, సూపర్వైజర్‌ లు, బూత్‌ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఇంటింటి వెరిఫికేషన్‌ ద్వారా జాబితాను సవరించవచ్చని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి పరిశీలన చేయాలని, ఆ పరిశీలనలో ఓటరు స్థానికంగా ఉన్నారా, మరణించారా, శాశ్వతంగా వెళ్ళిపోయారా, తాత్కాలికంగా వెళ్ళారా, ఫోటో లో మార్పులు చేయాలా అనేవి పరిశీలన చేయాలని అన్నారు. సూపర్వైజర్‌ లు ఓటరు జాబితాలను పరిశీలించాలని, సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని తెలిపారు.

అదేవిధంగా ఈ.ఆర్‌. ఒ.లు కూడా సూపర్‌ చెక్‌ చేయాలని అన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు ఒకే పోలింగ్‌ స్టేషన్‌ లో ఉండేవిధంగా పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల కమీషన్‌ పర్యటనలో ఎలాంటి తప్పులు కనబడకుండా ప్యూరిఫై చేయాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారం వారం సమావేశాలు నిర్వహించాలని, ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని అన్నారు. అట్టి విషయాన్ని ఆ సమావేశం మినిట్స్‌ లో నమోదు చేయాలని తెలిపారు.

ఏం.ఎల్‌.సి. గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఓటరు జాబితాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరి పేరు నమోదు చేయాలని తెలిపారు. ప్రైవేటు కళాశాలల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, సూచనలు పాటించుటకు చర్యలు తీసుకొంటామని, తప్పులు లేకుండా ఓటరు జాబితాను తయారు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అంతకుముందు రాజస్వ మండల అధికారి కార్యాలయంలో బూత్‌ స్థాయి అధికారుల రికార్డు లను ప్రధాన అధికారి పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ లు రంగనాథ్‌ రావు, మన్నె ప్రభాకర్‌, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాన్సువాడ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా మంత్రి అంజవ్వ గణేష్‌

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »