కామారెడ్డి, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని 8500 కోట్ల రూపాయలను సకాలంలో చెల్లించకపోవడం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, పెండిరగ్ ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.
విద్యార్థులు వారి ఉన్నత విద్య చదువుకోవడానికి కావలసిన సర్టిఫికెట్లను పొందలేక ఇబ్బందులు పడుతున్నారని మరొకవైపు కళాశాలలోని అధ్యాపకులకు జీతాలను చెల్లించలేక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులకు గువుతున్నాయని, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని అన్నారు.
కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు శివ, చందావత్ రమేష్ ఉప్పేరు సుభాన్, శివానంద గణేష్ జయచంద్ర, చీమ మహేష్, సురేష్ గుప్తాలతో పాటు అన్ని జిల్లాల టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.