బాన్సువాడ, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు.
ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు రమాకాంత్ రావు, దత్తాత్రేయ, లక్ష్మారెడ్డి, మొగులయ్య, ఖలీల్, హైమద్, కోర్టు సిబ్బంది సాయిబాబా, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.