ఎల్లారెడ్డి, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాలను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడే 3.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.