బాన్సువాడ, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దన్నారు.
ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ద్వారా డబ్బుతో పాటు సమయాన్ని వృధా అవుతుందన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, పట్టణ సీఐ మండల అశోక్, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఖలీల్, మొగులయ్య, అజీమ్, అయ్యల ఆనంద్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.