మాక్లూర్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్బంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ను, 500 రూపాయల సిలిండర్ సబ్సిడీని మరియు ఆడవారి కోసం ఉచిత బస్సుని అందించడం జరిగిందన్నారు.
దీనితో పాటు రైతులకు రెండు లక్షలలో రుణమాఫీని నిరవధికంగా చేస్తూ ఉన్నారు. ఇదేకాక రైతులకు సన్నబియ్యానికి బోనస్ గా క్వింటాలికి 500 రూపాయలు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మాక్లూర్ మండలానికి సుమారు 800 ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
వల్లభాపూర్ గ్రామానికి రైతాంగానికి సుమారు 50 లక్షలు బోనస్ సన్నవడ్లకు రావడం జరిగిందని, అంటే ఒక చిన్న గ్రామానికే 50 లక్షలు వస్తే మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి రైతులు ఎంత లబ్ధి పొదారో ఊహించుకోవచ్చన్నారు. రాబోవు రోజులలో రేషన్ దుకాణాలలో ప్రజలకి సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోవు రోజులలో మాక్లూర్ మండలానికి సుమారు 5 కోట్ల సీసీ డ్రైన్స్, సిసి రోడ్స్ మిగతా వర్కులకు గాను ఐదు కోట్ల రూపాయల నిధులు రాబోతుందని, ఇవే కాక చాలా నిధులు రాబోవు రోజులలో ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆయన వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.