నిజాం సాగర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం

నిజాంసాగర్‌, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్‌ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్‌లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లా, వీఐపీ గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌, తదితర కట్టడాలను జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల వర ప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని, వందేండ్లు గడిచిన చెక్కుచెదరలేదని అన్నారు. మూడు కాలాలు ఎప్పడు నిండుకుండలా ఉన్న నిజాంసాగర్‌ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు
ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పీపీపీ) ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తెస్తామని వెల్లడిరచారు. నిజాంసాగర్‌ హైడ్రో పవర్‌ స్టేషన్‌ లో 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో చర్చించి, దీన్ని పూర్తిగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, నీటి పారుదల శాఖ అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన నాయకుడు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »