తక్కువ ధరకే ఇంటర్నెట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్‌ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌ బాబు ఆదివారం ప్రారంభించారు.

టీఫైబర్‌ ద్వారా టీవీ, మొబైల్‌, కంప్యూటర్‌ వినియోగించ వచ్చని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. దీంతోపాటు మీసేవ మొబైల్‌ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

ఈ యాప్‌లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చామ న్నారు. రైతులకు రుణ మాఫీ, బోనస్‌ కోసం యాప్‌ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో టీ ఫైబర్‌ సేవలను ఆదివారం ప్రారంభించింది.

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.300కే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. దశలవారీగా ఇంటర్నెట్‌ సేవలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. టీ ఫైబర్‌ ఇంటర్నెట్‌ వైఫై కనెక్షన్‌ మాదిరిగా పనిచేస్తుంది.

ఈ కనెక్షన్‌ తీసుకుంటే టీవీతో పాటు ఫోన్‌, ఓటీటీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తారు. టీఫైబర్‌ తొలిదశంలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర గ్రామాలకు విస్తరించనున్నారు.

Check Also

రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »