కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మల్బరీ సాగు చేసే ఎస్సీ ,ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పట్టు దారానికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలని చెప్పారు.
శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్, సెంట్రల్ సిల్క్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేందర్ , పట్టు పరిశ్రమ ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ అధికారులు ఐలయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేందర్ రావు, డాక్టర్ సునీల్, రైతులు, తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు.