నిజామాబాద్, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 11న ఆర్మూర్ జడ్‌పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు.
ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్‌కి, అకాడమీ కోచ్ నరేష్‌కి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.