కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు.
ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. జిల్లా కోశాధికారి కార్యాలయం సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయం అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఏం.రాజన్న, జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, టీ.ఎన్.జి.ఒ. అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఎస్.టీ.ఒ. సాయిరెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ దేవేందర్, డాక్టర్ పి.వి.నరసింహం, ట్రెజరీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.