కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ.వీ.ఏం.గోదాం ను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోదాం ను పరిశీలించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.