బాన్సువాడ, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేయడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, కవిత, రమా, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.