కామారెడ్డి, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాపాలన కార్యక్రమములో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు, మీ ఇంటివద్దకు ఇందిరమ్మ ఇళ్లు సర్వే చేయుటకు గాను సర్వేయర్ మీ ఇంటివద్దకు వచ్చినపుడు ఈ క్రింద తెలిపిన వాటిని తప్పక తమ దగ్గర ఉంచుకొని సర్వేకు సహకరించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో కోరారు.
- రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు)
- ఆధార్ కార్డు
- కరెంటు బిల్లు
- ఇంటిపన్ను రసీదు
- పట్టా పాస్ బుక్కు
- భూమి యాజమాన్య పత్రం/ పోజిషన్ సర్టిఫికెట్
ఇళ్ళు ఇంటి యజమానురాలి పేరు మీద మంజూరు చేయబడుతుంది, వారి ఫోటో తీసుకోబడుతుంది. కావున ఇంటి యజమానురాలు తప్పక ఉండాలి.
ఇళ్ళు నిర్మాణం 400 స్క్వేర్ ఫీట్‌కి తక్కువ కాకుండా నిర్మించాలని, దీనికి గాను ప్రభుత్వం 5 లక్షల రూపాయలు లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో విడతల వారీగా జమచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.