నిజామాబాద్, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా సమీకృత కార్యాలయము సముదాయములోని డిఆర్‌డిఏ కార్యాలయం లో జిల్లా సమాఖ్య సమావేశము జరిగింది. ఇందులో డిఆర్‌డిఏ సాయగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వము జిల్లా సమాఖ్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్టి నూతన జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలిపారు.
ఈ సంధర్భంగా తమకు నూతన భవన నిర్మాణం కొరకు స్థలము, నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్కకి, జిల్లా కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డిఆర్డివో మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాల్లో లేని వారిని సంఘాలలో చేర్పించాలని తెలిపారు.
కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణము, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, ఫామ్, నాన్ ఫామ్ మండల సమైక్య గ్రామ సమస్యల ఆడిట్ మొదలగు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాయిగౌడ్, ఎస్‌ఇఆర్‌పి అధికారి భారతి, డిపిఎంలు సంధ్యారాణి, సాయిలు, శ్రీనివాస్, మారుతి, శ్రీనిధి ఆర్.ఎం రాందాస్, ఏ.పి.ఎం సరోజిని, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, కార్యదర్శి లావణ్య, కోశాధికారి లక్ష్మి, 28 మండలాల సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.