గ్రూప్‌ 2 అభ్యర్థులకు సూచనలు

కామారెడ్డి, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్‌ లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్‌ లో 1.30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ కోరారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తమ వెంట బ్లూ/బ్లాక్‌ పాయింట్‌ పెన్నులు, ఫోటోతో కూడిన హాల్‌ టికెట్‌, ప్రభుత్వం చేజారి చేసిన ఒరిజినల్‌ ఫోటోతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్‌ తీసుకుని రావాలని, హాల్‌ టికెట్‌పై పాస్పోర్ట్‌ సైజ్‌ ఫోటో ముద్రించి తీసుకుని రావాలని, ఒకే హాల్‌ టికెట్‌ ను పరీక్ష మొత్తం వినియోగించాలని తెలిపారు.

హాల్‌ టికెట్‌లో ఫోటో సరిగ్గా లేకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు గెజిటెడ్‌ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ సంతకంతో తీసుకువచ్చి పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్‌ కు అప్పగించాలని అన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందు వచ్చి చూసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్‌ సెల్ఫోన్‌ పెన్‌ డ్రైవ్‌ ,బ్లూ టూత్‌ డివైసెస్‌, హ్యాండ్‌ బ్యాగ్‌ లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని , చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని షూస్‌ వేసుకోవద్దని, సెల్ఫోన్‌ బ్లూటూత్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అభ్యర్థులు తీసుకువచ్చినట్లైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ అభ్యర్థిని ఇన్వాలిడేషన్‌ చేయడం జరుగుతుందని అన్నారు.

బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్‌ విడిచి వెళ్ళరాదని, బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ వ్యాలీడ్‌ కాదని, బయోమెట్రిక్‌ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, టాటూ వంటివి పెట్టుకోవద్దని అన్నారు.

ప్రతి పేపర్‌ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్‌ సమక్షంలో హాల్‌ టికెట్‌ పై సంతకం పెట్టాలని అన్నారు. మోడల్‌ ఓ.ఎం.ఆర్‌ షీట్ల ను వెబ్‌ సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకుని సరిగ్గా బబుల్స్‌ చేయడం ప్రాక్టీస్‌ చేయాలని, ఓ.ఎం.ఆర్‌ షీట్‌ ను సరిగా చెక్‌ చేసుకోవాలని, పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్‌ ను విడిచి వెళ్లడానికి వీలులేదని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

190 మంది దివ్యాంగ అభ్యర్థులకు పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో వింగ్‌ ఏ, బి గదులను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అంధులు, పరీక్ష స్వయంగా రాయలేని వారికి 23 మంది సహాయకులుగా (స్కైబ్స్‌) నియమించడం జరిగిందని తెలిపారు. అలాంటి అభ్యర్థులు సదరం సర్టిఫికెట్‌/ అపెండిక్‌ – 3 తప్పనిసరిగా చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు చూపించాలని తెలిపారు.

Check Also

నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »