కామారెడ్డి, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 14 న కామారెడ్డి పట్టణంలోని 14 వ వార్డ్ లో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ ప్రారంభిస్తున్నట్లు ఆయుష్ శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎ.శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని డిస్పెన్సరీ నీ స్థానిక మున్సిపల్ 14వ వార్డ్ లోని ఫ్రీడం ఫైటర్ భవనంలోకి మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఔట్ పేషెంట్ సర్వీస్ కూడా పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.