డిచ్‌పల్లి, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కోర్స్ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు 17-12-2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12. 30 గంటల వరకు భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు.
ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాల సెమినార్ హాలులో నిర్వహించబడుతుందని, తక్షణ ప్రవేశాల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీ లా సెట్-2024 / టీజీ పీజీ లా సెట్-2024 ఎంట్రెన్స్‌లో ఉత్తర్నులై ఉండాలన్నారు. ప్రవేశాలు స్టేట్ ర్యాంక్ మెరిట్ ఆధారంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
పవేశాలకు హాజరయ్యే విద్యార్థులు తమ ఒర్జినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియంబర్స్మెంట్ మరియు హాస్టల్ వసతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. ఎల్‌ఎల్‌బిలో 14 సీట్లు మరియు ఎల్.ఎల్.ఎమ్ 01 ఒక సీటు ఖాళీగా ఉన్నాయని, తక్షణం ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్ సందర్శించవచ్చన్నారు.