Daily Archives: December 13, 2024

ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో పనులు చేయించకూడడు

నిజామాబాద్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో డైట్‌, కాస్మోటిక్‌ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమమును పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ …

Read More »

వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు

నిజామాబాద్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారంసందర్శించారు. ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల …

Read More »

సంక్రాంతి తరువాత రైతు భరోసా విడుదల చేస్తాం…

నిజాంసాగర్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుందో అలాంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా రెండవ పంటలకు నీటిని ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను ఆయన సందర్శించారు. విశ్రాంతి భవనం …

Read More »

పత్తి పంటను వెంటనే కొనుగోలు చేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్‌ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం మద్నూర్‌ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ జిన్నింగ్‌ మిల్లును కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని …

Read More »

బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలి…

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం ఫత్లాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణానికి అనువైన భూమి ఉందో …

Read More »

జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతా…

నసురుల్లాబాద్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతానని మండల ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ప్రెస్‌ క్లబ్‌ సమావేశంలో నూతన ప్రెస్‌ క్లబ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వేణుగోపాల్‌ గౌడ్‌ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యలపై అనుతం పోరాడుతానని నేటి …

Read More »

క్రీడల్లో సత్తాచాటిన ఆర్మూర్‌ విద్యార్థినిలు

ఆర్మూర్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్‌ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్‌ కాలేజ్‌ టోర్నమెంట్లో ఆర్మూర్‌ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్‌ 800 మీటర్లు మరియు లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్‌ లో నిహారిక టీం …

Read More »

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన పిడిఎస్‌యు

నిజామాబాద్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మెకు ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టియుసిఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌, పిడిఎస్‌యు జిల్లా ప్రధానకార్యదర్శి కే.గణేష్‌ సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎం.సుధాకర్‌, కే. గణేష్‌ లు మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎ, కేజీబీవీ లో పనిచేస్తున్న ఉద్యోగులు …

Read More »

మీ సేవలో కొత్త సర్వీసులు ప్రారంభం…

నిజామాబాద్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్‌ నుండి 6 రకాల సర్వీసులు, ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ నుండి 2 రకాల సర్వీసులు మరియు ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, సీనియర్‌ సిటిజెన్‌ డిపార్ట్మెంట్‌ నుండి ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చాయి అని ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ కార్తీక్‌ కుమార్‌ తెలిపారు. గ్యాప్‌ సర్టిఫికేట్‌ (రెవిన్యూ) నేమ్‌ చేంజ్‌ అఫ్‌ సిటిజెన్‌ (రెవిన్యూ) లోకల్‌ కాండిడేట్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 13, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 6.17 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.49 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.28 వరకుయోగం : శివం ఉదయం 11.40 వరకుకరణం : కౌలువ ఉదయం 7.22 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.17 వరకుఆ తదుపరి గరజి తెల్లవారుజామున …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »