కామారెడ్డి, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని తెలిపారు.
కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పత్తి విక్రయ చెల్లింపులో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగారు. రైతులకు చెల్లింపుల విషయాన్ని సీసీఐ ఇన్చార్జినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిన్నింగ్ ప్రాసెసింగ్, బెల్ ప్రాసెసింగ్లను కలెక్టర్ పరిశీలించారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, కార్యదర్శి రాం నాథ్ రావు, తహసీల్దార్ ముజీప్, ఎంపీడీఓ రాణీ, ఎంపీఒ వెంకట నరసయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.