నిజామాబాద్, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వారం రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, పిడిఎస్‌యు జిల్లా ప్రధానకార్యదర్శి కే.గణేష్ సంఫీుభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎం.సుధాకర్, కే. గణేష్ లు మాట్లాడుతూ ఎస్ఎస్ఎ, కేజీబీవీ లో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్నారు. సుమారు 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేకుండా పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్, కేజీబీవీ సిబ్బందికి, ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రెగ్యులరైజ్ చేయాలన్నారు.
తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీచేసి, పని భారం తగ్గించాలన్నారు. పిఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. వారి డిమాండ్ల సాధన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అవసరమైతే వారితో ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటామనీ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హేమలత, ప్రధాన కార్యదర్శి సుమలత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.