నసురుల్లాబాద్, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నసురుల్లాబాద్ మండలం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతానని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు.
జర్నలిస్టుల సమస్యలపై అనుతం పోరాడుతానని నేటి కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తూ ఆయన మాట్లాడారు జర్నలిస్టు అనేవాడు నిత్యం ప్రజా సేవకుడిగా ఉంటాడని అటు రాజకీయ నాయకులకు అధికారులకు ప్రజలకు వారధిగా ఉండాల్సిన జర్నలిస్టులపై పలువురు దాడులు చేపడుతున్నారు అటువంటి దాడులను అడ్డుకోవడానికి తాను ముందు ఉంటానని ఆయన అన్నారు.
తనపై నమ్మకం నుంచి ఈ పదవిని అందించినందుకు కృతజ్ఞుడై ఉంటానని ఆయన అన్నారు. నమ్మకం ఉంచి బాధ్యతలను స్వీకరిస్తున్నానని పదవిగా భావించకుండా బాధ్యతగా భావించి పనిచేస్తానని అన్నారు. నగేష్, రాజా గౌడ్, కప్పల రమేష్, కొండ ప్రవీణ్ కుమార్ లు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, మహబూబ్, భవాని సింగ్, శ్రీధర్ గౌడ్, మహేష్ గౌడ్, దాది మల్లేష్, మహబూబ్, హనుమాన్లు పాల్గొన్నారు.