కామారెడ్డి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం మాచారెడ్డి మండలం లచ్చపేట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కైరంకొండ శివరాములు, జక్కుల రాంచంద్రం ప్రమాదవశాత్తూ మరణించారు వారి కుటుంబాలకు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రమాదబీమా చెక్కులను కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ చేతుల మీదగా స్వర్గీయ కైరంకోండ శివరాములు బార్య లక్ష్మి, జక్కుల రాంచంద్రం బార్య నిలవ్వకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ జడ్పిటిసి మీన్కురి రాంరెడ్డి, నల్లవేల్లి ఆశోక్, శంకర్, గెరిగంటి లక్ష్మినారాయణ, లచ్చపేట్ మాజీ ఎంపిటిసి బుస శ్రీనివాస్, లద్దురి కృష్ణ యాదవ్, దినేష్ మరియు లచ్చపేట్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.