కామారెడ్డి, డిసెంబరు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ జీ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్ వాడీ భవనాలు, తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తు దారులు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తుల పై సమీక్షిస్తూ, ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండిరగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలనీ, మండల అధికారులు సూపర్ చెక్ చేయాలని అన్నారు. అవసరమైన లాగిన్ లు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఇంటింటి సమగ్ర సర్వే ఆన్లైన్ లో పొండుపరచాలని తెలిపారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.