కామారెడ్డి, డిసెంబరు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారురాలు పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్‌లో పొందుపరచాలని తెలిపారు.
ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లుతో పాటు లబ్ధిదారురాలు ఫోటో, స్వంత ఇల్లు అయితే డాక్యుమెంట్లు, లేదా ఇంటి పన్ను చెల్లించిన రసీదు లను యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇల్లు కట్టుకొనుటకు గల స్థలము దాని డాక్యుమెంట్లను యాప్‌లో పోందుపరచాలని తెలిపారు. వారి జీవన స్థితి గతులను, కుటుంబ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని రజిత, డివిజనల్ పంచాయతీ అధికారి పి.వి.శ్రీనివాస్, తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.