ఆర్మూర్, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ క్రికెట్ అకాడమీకి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, వర్సెస్ గగన్ మహల్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు రతన్, వర్షిత్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు.
మహమ్మద్ అమానుద్దీన్, రైట్ అండ్ లెగ్‌స్పిన్ 5 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. మహమ్మద్ మతిన్, తన ఆల్ రౌండ్ ప్రతిభతో 2 ఓవర్లు వేసి 2 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 20 బాళ్లలో 5I4, 26, రన్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన గగన్ క్రికెట్ క్లబ్ 25.5 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విజయనగర్ క్రికెట్ క్లబ్ 23 ఓవర్లలో 164 పరుగులు చేదించి విజయం సాధించారు. ఈ విజయంలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి విజయంలో కీలక పాత్ర పోషించారు.