కామారెడ్డి, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్ రక్తం కలిగిన రక్తదాత అని చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని, అదేవిధంగా ఈ రోజు తన కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదినము సందర్భంగా రక్తదానం చేయడం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.
రక్తదానానికి మించిన దానం ప్రపంచంలో మరొకటి లేదని రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మంచి మనసుతో రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. రక్తదాత ఎడ్ల రాజుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీశైలం, చంద్ర గౌడ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, వెంకటేశ్ పాల్గొన్నారు.