కామారెడ్డి, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతం చేసేందుకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిచే పోస్టర్ ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు ప్రోత్సహించడానికి ప్రతిభ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.
తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో టిఎంఎప్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కాలువ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గన్నేమనేని రామారావు, ఆర్థిక కార్యదర్శి నరేందర్ గౌడ్, గోవర్ధన్, రవి ఉప్పు వెంకటి, తదితరులు పాల్గొన్నారు.