నిజామాబాద్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిజామాబాద్ పట్టణంలో గల నాందేవ్వాడ బిసి బాలుర సంక్షేమ వసతి గృహంలో రవాణా శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్, బిసి సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, ఐడార్ జిల్లా మేనేజర్ వర్షా హాజరై వసతి గృహ బాలురకు రోడ్డు భద్రత పై అనేక సూచనలు సలహాలు చేశారు. వీడియోల రూపంలో చక్కగా వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారులు రాజు, బాల కృష్ణ పాల్గొన్నారు.