ఆర్మూర్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, పి.జె.ఎల్ క్రికెట్ క్లబ్, ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుడు రతన్ వర్షిత్, మరో మారు ఆఫ్ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
46 బంతుల్లో 9I4,1I6 బాధి 62 రన్స్ చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఈ విజయంలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి విజయంలో కీలక పాత్ర పోషించారు. వారిని పలువురు క్రికెట్ అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.