గాంధారి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత విద్యా సంవత్సరంలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారిలో నర్సరీ లను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్ లోని కిచెన్లో వంటలను, స్టోర్ రూమ్ లోని బియ్యం పరిశీలించారు.
అనంతరం 10 వ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆరా తీశారు. ఈ విద్య సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, 10/10 జిపిఎ సాధించాలని విద్యార్థులకు తెలిపారు. చదువుతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం తెలుసుకునేందుకు ఉపాద్యాయులు అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నాం అని ఉపాద్యాయులు తెలిపారు. అనంతరం మాథమేటిక్స్ కు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి సమాధానాన్ని రాబట్టారు. పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
అనంతరం ఆరోగ్య ఉప కేంద్రం ను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, గర్భిణీలకు నెలవారీ పరీక్షలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్ లను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్రన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, ప్రతీ సమాచారం యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలను, కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న ఆట పాటల్ని అడిగి తెలుసుకున్నారు.
పిల్లలతో పాటలు పాడిరచారు. పిల్లవాడిని ఎత్తుకొని అక్కడ ఏర్పాటుచేసిన బొమ్మలను ఏమంటారు అని పిల్లలని కలెక్టర్ అడిగారు. అనంతరం గాంధారి నర్సరీను సందర్శించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయని, నీటిని రెండు మూడు రోజులు పట్టాక విత్తనాలు విత్తడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈ సారి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా విద్య శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఇన్చార్జి తహసీల్దార్ రవికాంత్, ఎంపీడీఓ సతీష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.