నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఐడిఓసి సమావేశ మందిరము కలెక్టరేట్‌లో శుక్రవారం డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పాల్గొని పోషణ్ అభియాన్ కార్యక్రమాలు జరగాలంటే అన్ని శాఖలు సహకరించాలని అప్పుడే గర్భవతులు, బాలింతలు, పిల్లల యొక్క పోషణ స్థాయి మెరుగు పడుతుందని తెలిపారు.
అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, భవన నిర్మాణం తొందరగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సభ్యులు, సి డి పి వో లు, సూపరింటెండెంట్ సూపర్ వైజర్లు అంగన్వాడీ టీచర్ లు పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.