కామారెడ్డి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్వరి (42) అనీమియా వ్యాధితో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని ఆరవసారి కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా కామారెడ్డి రక్తదాతలు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి రక్తదాతల్లో రాజశేఖర్ ఒకరని, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రాజశేఖరకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. ప్రపంచంలో డబ్బు లేకుండా చేయగలిగే అత్యంత విలువైన సహాయం రక్తదానం మాత్రమే అని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.