బాన్సువాడ, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ కేంద్రాన్ని శనివారం డిపో మేనేజర్ సరిత దేవి, కార్గో ఏటీఎం పాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రాష్ట్రంలోని నగరాల నుండి తమ వస్తువులను పార్సెల్ చేసుకోవచ్చని, బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కార్గో సేవలను చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్గో ఇన్చార్జ్ ఇర్ఫాన్, ఏజెంట్ బాలు తదితరులు పాల్గొన్నారు.