కామారెడ్డి, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణంలోని పిజెఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్ మరియు ఎకనాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 వందల ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు.
ఉద్యోగ మేళకు హాజరగు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులైనా విద్యను అభ్యసించి డిగ్రీ పాసై ఉండాలని పిజెఆర్ కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం 23వ తేదీ పిజెఆర్ కళాశాలలో జరిగే మెగా రిక్రూమెంట్ డ్రైవ్ ను కామారెడ్డి పట్టణ ప్రాంత విద్యార్థులు అందరూ వినియోగించుకోగలరని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్ పాల్గొన్నారు.