బాన్సువాడ, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ధ్యానంతోనే మనిషికి మానసిక ప్రశాంతత దొరుకుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ధ్యాన దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి ధ్యానం పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే మానసిక ఒత్తిడికి గురికాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.