బాన్సువాడ, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీ బ్యాగ్ ఫీల్లింగ్ పనులను శనివారం ఎంపీడీవో భషిరోద్దిన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ షాబోద్దీన్, సిబ్బంది చాంద్ తదితరులు పాల్గొన్నారు.