నిజామాబాద్, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా శనివారం న్యాయవాదిద పరిషత్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో ఘనంగా ధ్యాన దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించి ధ్యాన దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ధ్యానం చేయడం ద్వారా సమాజంలో పెరుగుతున్న ఒత్తిళ్లు హింస ప్రేమిస్తున్న పరస్పర సంబంధాలను విశ్వాసం వంటి ఎన్నో సమస్యలను ధ్యానం ద్వారా పరిష్కారాన్ని సూచిస్తుందని నిత్యజీవితంలో ప్రజలందరూ ధ్యానం నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకొని ఆ దిశగా ప్రశాంత జీవనం గడుపాలని కోరారు.
కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి రాజరాని అగర్వాల్ మాట్లాడుతూ ధ్యానాన్ని ఏ విధంగా చేయాలి ధ్యానం చేస్తే లాభాలు ఏంది అని న్యాయవాదులకు వివరించి వారితో 15 నిమిషాలు ధ్యానాన్ని చేయించారు. అదేవిధంగా ప్రాణాయం యొక్క ప్రాముఖ్యత వివరించారు. ప్రస్తుత సమాజంలో న్యాయవాదులు వారి నిజజీవితంలో పని ఒత్తిడి వల్ల డిప్రెషన్ బిపి షుగర్ ఇలాంటి ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. శరీరాన్ని ఏ విధంగా అయితే మనం శుద్ధి పరుస్తాము మన మనసును మన మెదడును శుద్ధి చేసుకునే యంత్రమే తెలిపారు.
కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, చీప్ లిగలేడు డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు సుదర్శన్ రెడ్డి అంకిత, పులి జైపాల్, ప్రభాకర్ రెడ్డి, గంగారాం, మధుకర్, శ్రీమన్, సాదుల్ల, ఆశా నారాయణ, చరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.