ఆర్మూర్, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో ఆదివారం రోజు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ నిర్మల్ క్రికెట్ జట్టు ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా ఆర్మూర్ క్రికెట్ అకాడమీ విజేతగా నిలిచింది.
డ్రాలో ఫైనల్ కు చేరిన సల్లు క్రికెట్ అకాడమీ, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు 140 పరుగులు చేయగా, సల్లు క్రికెట్ అకాడమీ జట్టు 115 పరువులకు ఆల్ అవుట్ అయింది. రతన్ విజ్ఞాన్ 48 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. పింజ రుద్రాన్స్ 10 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి 15 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు పింజ సుదర్శన్ విజేతలకు ట్రోఫీని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కోచ్ రతన్, సల్లు క్రికెట్ అకాడమీ కోచ్ సల్లు, మహమ్మద్ రఫీ, ఆర్మూర్ సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు పింజ భరత్, తదితరులు పాల్గొన్నారు.