నిజామాబాద్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో జరిగిన సీఎం కప్-2024 జిల్లా బేస్ బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు.
కార్యక్రమంలో డివైస్ ఓ ముత్తన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శి మర్కంటి సుజాత, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపల్ పి నళిని, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల జిల్లా స్పోర్ట్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, జిల్లా కోచ్ లు మౌనిక, హెచ్ అనికేత్ శ్రీలత ,అంజలి పాల్గొన్నారు.