కామారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగం పేట్ మండలం బాయంపల్లి గ్రామంలో ఐ.కే. పి. ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాన తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. చేపల పెంపకం దానతయారు చేసేందుకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి ద్వారా కుంట యశోద కు 3.50 లక్షల రూపాయలు రుణం క్రింద మంజూరు చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చేపల పెంపకం, దాన తయారీకి కుటుంబం మొత్తం కృషి వలన ఆర్థిక స్తోమత పెరుగుతుందని అన్నారు. స్వయంగా చేపల దాన తయారు చేయడం అభినందనీయమని అన్నారు. చేపల పెంపకం పై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జిల్లా మత్స్య శాఖాధికారి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందిస్తామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ నరేష్, ఎంపీఒ మలహరి, తదితరులు పాల్గొన్నారు.