కామారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
అక్కడినుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, గ్రంధాలయం చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.