కామారెడ్డి, డిసెంబరు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు బుధవారం ప్రభుత్వ సాధారణ వైద్యశాల కామారెడ్డిలో వారి మాతృమూర్తి స్వర్గీయ నీల విమల 12 వ వర్ధంతి సందర్భంగా 75 వ సారి రక్తదానం చేసి ఎమరాల్డ్ రక్తదాతల క్లబ్‌లో నమోదు అయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్త దానం చేయడం వలన గుండె సంబంధిత,క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం 15 రోజులకు ఒకసారి ప్లేట్ లెట్స్‌ను అందజేసే అవకాశం ఉంటుందని అన్నారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలన్నారు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని,2025 వ సంవత్సరంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నంబర్ కి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ నూర్ సింగ్ పాల్గొన్నారు.