నిజామాబాద్, డిసెంబరు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.
క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.